: వ్యాట్ కు నిరసనగా ఆయిల్ ట్యాంకర్ల యజమానుల సమ్మె


ఆయిల్ ట్యాంకర్ల యజమానుల సంఘం నిరసన రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. తమకు చమురు కంపెనీలు చెల్లిస్తున్న అద్దెపై 5 శాతం వ్యాట్ ను రాష్ట్ర ప్రభుత్వం విధించడాన్ని వ్యతిరేకిస్తూ పెట్రోల్, డీజిల్ రవాణా చేసే పలువురు ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెలో పాల్గొన్నారు. చమురు సంస్థలు దిగొచ్చేవరకూ సమ్మె కొనసాగిస్తామని పెట్రోల్, డీజిల్ ట్యాంక్ ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంక్ లు స్థంభించిపోనున్నాయి. దీంతో రాష్ట్రంలోని బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడనుంది. కాగా, గత అర్ధరాత్రి నుంచి హెచ్ పీసీఎల్, ఐవోసి, బీపీసీఎల్ కు చెందిన 15 వందల ట్యాంకర్లు నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News