: దేహదారుఢ్య పరీక్షల్లో కానిస్టేబుల్ మృతి
పోలీస్ శాఖ నిర్వహించే దేహదారుఢ్య పరీక్షలు కానిస్టేబుళ్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఫిట్ నెస్ కోసం సాధారణంగా ప్రతినెలా కానిస్టేబుళ్లకి ఈ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. అదే విధంగా ఈ ఉదయం హైదరాబాదులో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా సైబరాబాద్ పరిధిలోని నాచారం పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న సత్తయ్య 5 కిలో మీటర్ల పరుగులో పాల్గొని సొమ్మసిల్లి పడిపోయాడు. దాంతో వెంటనే అతన్నిమల్కాజిగిరిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే సత్తయ్య మరణించినట్లు తెలిపారు. ఈ ఘటనతో మిగతా కానిస్టేబుళ్లు విషాదంలో మునిగిపోయారు.