: తుంగభద్ర డ్యాంకు భారీగా చేరుతున్న వరద నీరు
తుంగభద్ర ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో... తుంగభద్ర డ్యాంకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1600.54 అడుగులకు చేరింది. ప్రస్తుత ఇన్ ఫ్లో 44 వేల క్యూసెక్కులుగా ఉంది. ఇన్ ఫ్లో మరింత పెరిగితే డ్యాం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.