: ఈ రోజు చంద్రబాబు షెడ్యూల్ ఇదే...!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటనకు గాను పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లిన సంగతి తెలిసిందే. పర్యటన రెండో రోజైన నేడు ఆయన షెడ్యూల్ ఈ విధంగా ఉంది. ఉదయం 9.30కి జంగారెడ్డిగూడెంలో అధికారులతో సమీక్ష, మధ్యాహ్నం 12.30కి నర్సన్నపాలెం, బయ్యన్నగూడెం రైతులతో ముఖాముఖి, ఒంటిగంటకు కొయ్యలగూడెంలో పొగాకు రైతులతో భేటీ, 2.30 గంటలకు డ్వాక్రా మహిళలతో సమావేశం. అనంతరం, సాయంత్రం 5 గంటలకు ఆయన హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు.

  • Loading...

More Telugu News