: ఇక హీరో బైకులకు ఐదేళ్ళ పాటు ఫ్రీ సర్వీస్


మీరు హీరో బైక్ కొన్నారా? అయితే 70వేల కిలోమీటర్ల వరకూ దర్జాగా సాగిపోవచ్చు. ఇంజన్ కు సంబంధించి ఏ సమస్య వచ్చినా ఫ్రీ సర్వీస్. ''బండి కొని రెండేళ్లే అయింది.. 50వేల కిలోమీటర్లు కూడా తిరగలేదు అప్పుడే బోర్ కు వచ్చింది'' ఇలాంటి చీకూ చింతా అవసరం లేదు. హీరో కంపెనీ అన్నిరకాల మోటార్ సైకిళ్లు, ,స్కూటర్లపై ఐదేళ్ల వారంటీ లేదా 70 వేల కిలోమీటర్ల వరకూ వారంటీని ప్రకటించింది. అంటే వీటిలో ఏది ముందు పూర్తయితే అంతటితో వారంటీ కూడా ముగిసిపోతుంది. మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు హీరో కంపెనీ ఐదేళ్ల వారంటీని పోటీ మంత్రంగా బయటకు తీసింది. ఇప్పుడు మిగతా కంపెనీలూ ఇదే బాట పట్టే అవకాశం ఉంది. అదే జరిగితే వినియోగదారులకు నిజంగా కొంత లాభదాయకమే!

  • Loading...

More Telugu News