: గాజా దాడులపై చర్చ అవసరం లేదు: సుష్మ
పాలస్తీనాతో పాటు ఇజ్రాయెల్ కూడా భారత్ కు మిత్రదేశమేనని, ఈ నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులపై పార్లమెంట్ లో చర్చ అవసరం లేదని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ బుధవారం రాజ్యసభకు చెప్పారు. గాజాపై ఎనిమిది రోజులుగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపై చర్చ జరపాల్సిందేనన్న విపక్షాల వాదనను మంత్రి తోసిపుచ్చారు. ’ఇరు దేశాలతో భారత్ కు సత్సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో జరిగే చర్చలో ఏదైనా పొరపాటు జరిగితే, ఆ దేశాలతో మనకున్న సంబంధాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఈ కారణంగానే చర్చకు అనుమతించడం లేదు‘ అంటూ ఆమె ప్రకటించారు.