: ధరల నియంత్రణకు చర్యలు చేపడతాం: మంత్రి పరిటాల సునీత


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత కర్నూలులోని రైతుబజార్లను పరిశీలించారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టనున్నట్లు ఆమె చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... 2009లో వరదలు వచ్చినప్పుడు కర్నూలు జిల్లాలోని నెజ్జూరు, భావాపురం గ్రామాలను దత్తత తీసుకుని బాధితులకు సేవలు అందించామని చెప్పారు. పరిటాల రవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాలను చేపట్టామని ఆమె తెలిపారు. కర్నూలు జిల్లాలో ఉల్లి పంటను అధికంగా పండిస్తున్నారని, ఆ పంటను వేరే రాష్ట్రాలకు తరలించకుండా స్వరాష్ట్రంలోనే అమ్ముడయ్యేలా చర్యలు తీసుకుంటామనీ అన్నారు.

  • Loading...

More Telugu News