: పిచ్చోడి చేతిలో రాయి... కన్నతల్లి ప్రాణం తీసింది!
మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి రాయితో కొట్టడంతో... కన్నతల్లి మరణించింది. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లా ఎఎస్ పేటలో జరిగింది. మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన ఖాసిం మతిస్థిమితం కోల్పోవడంతో... ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. తల్లి, భార్య కలిసి అతనిని ఏఎస్ పేటలోని దర్గాకు తీసుకువచ్చారు. అక్కడ ఖాసిం ఒంటరిగా బయటకు వెళుతుండగా తల్లి, భార్య వారించారు. ఖాసిం వారి మాటలను పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో... వారు అతనిని అనుసరించారు. దీంతో ఖాసిం పెద్ద రాయితో తల్లి తలమీద కొట్టడంతో, ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.