: ముంబయి పేలుళ్ల నిందితుడు గోవాలో అరెస్టు
2011 ముంబయి పేలుళ్ల ఘటనలో నిందితుడు అబ్దుల్ మతీన్ ఫక్కీ ని గోవాలో యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ అరెస్టు చేసింది. రేపు అతడిని కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. నాటి పేలుళ్లలో 26 మంది మృతి చెందారు. ముంబయి నగరంలో పేలుళ్లు జరిపేందుకు ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ కు హవాలా నెట్వర్క్ ద్వారా అబ్దుల్ డబ్బు పంపి సాయం చేశాడు.