: కళ కోల్పోతున్న శ్రీవారి ఆలయ మహాద్వార గోపురం
తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వార గోపురం రూపు కోల్పోతోంది. ఇప్పటికే శ్రీవారి గోపురంపై వివిధ దేవతా ప్రతిమలు విరిగిపోయాయి. లైట్ల కోసం ఏర్పాటు చేసిన ఇనుపరాడ్లు తుప్పుపట్టాయి. వీటితో పాటు గోపురం పైన పిచ్చి మొక్కలు కూడా మొలిచాయి. దీంతో రాజగోపురం పూర్తిగా కళావిహీనంగా మారింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ రాజగోపురాన్ని 15వ శతాబ్దాంలో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. అప్పటినుంచి ఈ గోపురం చెక్కుచెదరలేదు. అయితే ఇటీవలి కాలంలో టీటీడీ ఇంజనీరింగ్ విభాగం రాజగోపురం బాగోగుల విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహించడంతో గోపురం పూర్తిగా కళ తప్పిందని శ్రీవారి భక్తులు ఆరోపిస్తున్నారు.