: పాక్ కాల్పుల్లో భారత జవాన్ మృతి
పాకిస్తాన్ సైన్యం మరోమారు భారత్ పై కాలు దువ్వింది. అంతర్జాతీయ సరిహద్దు వెంట ఇరు దేశాల మధ్య అమలులో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కిన పాక్ సైనికులు భారత చెక్ పోస్ట్ పై కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో భారత సరిహద్దు దళానికి చెందిన ఓ జవాను మృతి చెందగా, మరో నలుగురు జవాన్లు గాయపడ్డారు. జమ్మూ జిల్లాలోని పిట్టల్ చెక్ పోస్ట్ పై బుధవారం ఉదయం 11.15 గంటల ప్రాంతంలో పాక్ సైనికులు కాల్పులు జరిపారని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఈ చర్య ద్వారా పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచినట్టయిందని ఆ అధికారి పేర్కొన్నారు.