: ఎంసెట్ అడ్మిషన్లపై విచారణ 21కి వాయిదా
ఎంసెట్ అడ్మిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. ఇంజినీరింగ్ అడ్మిషన్లను అక్టోబరు 31 వరకు పెంచాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అడ్మిషన్ల గడువుకు సంబంధించిన పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపాలని ‘సుప్రీం’ సూచించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలు జరిగినందున ఇబ్బందులు రావా? అని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అడ్మిషన్ల విషయంలో ఏఐసీటీఈకి కూడా సుప్రీంకోర్టు నోటీసు పంపింది.