: రూ. 20 కోట్ల చొప్పున కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొంటోంది: కేజ్రీవాల్


ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్ల చొప్పున చెల్లించి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భారతీయ జనతా పార్టీ యత్నిస్తోందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతున్న బీజేపీ ఈ తరహా యత్నాలకు తెరతీసిందని ఆయన బుధవారం వ్యాఖ్యానించారు. ఒప్పందంలో భాగంగా ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్ల చొప్పున చెల్లించేందుకు కూడా బీజేపీ వెనుకాడటం లేదని ఆయన ఆరోపించారు. అంతేగాక, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమవైపు దూకితే వారికి మంత్రి పదవులు, చైర్మన్ పదవులను కూడా కట్టబెట్టేందుకు బీజేపీ నేతలు సిద్ధంగా ఉన్నారని తన ట్విట్టర్ పేజీలో కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై బీజేపీ ఘాటుగానే స్పందించింది. కేజ్రీవాల్ మానసికంగా కుంగిపోయిన స్థితిలో ఉన్నాడని, తక్షణమే మెంటల్ చెకప్ చేయించుకోవాలని బీజేపీ ఎంపీ రమేశ్ బిధురి కాస్త ఘాటు వ్యాఖ్యలే చేశారు.

  • Loading...

More Telugu News