: పోలవరం ప్రస్తుత డిజైన్ తో రామాలయానికి ముప్పు: డీకే అరుణ
పోలవరం ప్రాజెక్టును ప్రస్తుత డిజైన్ ప్రకారం నిర్మిస్తే, భద్రాచలంలోని రామాలయం ముంపునకు గురయ్యే ప్రమాదముందని మాజీ మంత్రి డీకే అరుణ ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన చట్టాన్ని ఉల్లంఘించేలా ఉన్న ప్రస్తుత డిజైన్ ను మార్చాలంటూ పోరాటం సాగిస్తామని బుధవారం ఆమె తెలిపారు. ఛత్తీస్ ఘడ్, ఒడిశాలను కలుపుకుని న్యాయపోరాటం చేస్తామన్నారు. మరోవైపు, పోలవరం డిజైన్ ను మార్చాల్సిందేనని తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేత జానారెడ్డి కూడా బుధవారం డిమాండ్ చేశారు.