: బామ్మ గారు ‘సెంచరీ’ కొట్టారు


బామ్మ గారు నిండు నూరేళ్లనూ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలసి ఈ శతాధిక వృద్ధురాలిని హైదరాబాదులోని ఓ హోటల్ లో ఘనంగా సన్మానించారు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని జెంపలి గ్రామానికి చెందిన నన్నెపాగ ఏమేలియమ్మ నగరానికి వచ్చి నాగోలులో నివాసం ఉంటోంది. బామ్మగారు ప్రభుత్వ టీచర్ గా పనిచేసి 1971లో రిటైర్ అయ్యారు. ఆమె వందో పుట్టినరోజు వేడుక మంగళవారం నాడు హైదరాబాదు అల్కాపురిలోని స్వాగత్ గ్రాండ్ హోటల్ లో జరిగింది. అన్నట్టు, ఈ ‘సెంచరీ’ బామ్మగారికి 63 మంది కుటుంబ సభ్యులున్నారండోయ్!

  • Loading...

More Telugu News