: ఉరికి వ్యతిరేకంగా కాశ్మీర్లో ఆందోళనలు
ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరి తీయడాన్ని జమ్మూ కాశ్మీర్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా నాలుగు రోజులపాటు ఆందోళనలు చేయాలని వేర్పాటు వాద సంస్థ హురియత్ కాన్ఫరెన్సు (జమ్మూ కాశ్మీర్ ను దేశం నుంచి విభజించాలని పోరాడుతోంది) పిలుపునిచ్చింది. అఫ్జల్ ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని ఎన్నిసార్లు కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని నేషనల్ కాన్ఫరెన్సు, హురియత్ కాన్ఫరెన్సు ఆరోపించాయి.
హురియత్ అలా పిలుపునిచ్చిన వెంటనే ఆందోళనలు ప్రారంభం అయ్యాయి. అఫ్జల్ స్వస్థలం సోపూర్ జిల్లా, బారాముల్లాలో దాడులు జరిగాయి. ఇద్దరు గాయపడ్డారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో 10 జిల్లాల్లో కర్ఫ్యూ విధించి భద్రతను పెంచారు.