: కేజ్రీవాల్ మెంటల్ చెకప్ కు వెళ్ళాలి: బీజేపీ సలహా


ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు మతిభ్రమించినట్టుందని, ఆయనోసారి మెంటల్ చెకప్ చేయించుకుంటే మేలని బీజేపీ వ్యంగ్యోక్తి విసిరింది. ఢిల్లీలో సర్కారు ఏర్పాటు చేసేందుకు బీజేపీ అడ్డదారులు తొక్కుతోందని కేజ్రీవాల్ ఓ ఆడియో సందేశం వెలువరించారు. ఢిల్లీలో గద్దెనెక్కేందుకు బీజేపీ ఒక్కో ఎమ్మెల్యేకి రూ.20 కోట్లు ఆశచూపుతోందని కేజ్రీ ఆరోపించారు. దీనిపై బీజేపీ సీరియస్ అయింది. తక్షణమే కేజ్రీవాల్ మెంటల్ చెకప్ చేయించుకోవాలని ఢిల్లీ బీజేపీ నేత, ఎంపీ రమేశ్ బిధురి సూచించారు.

  • Loading...

More Telugu News