: ‘బదౌన్’ సామూహిక అత్యాచారం, హత్యల కేసులో కీలక ఆధారాలు లభ్యం


ఉత్తర ప్రదేశ్ లో సామూహిక అత్యాచారం, ఆపై హత్యకు గురైన ఇద్దరు దళిత బాలికలకు సంబంధించి సీబీఐకి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన బాలికల్లో వయసులో పెద్దదైన బాలికకు సంబంధించినవిగా భావిస్తున్న చెప్పులు సీబీఐ చేతికి చిక్కాయి. ఈ చెప్పులను బలవంతంగా విరిచేసినట్లుగా కనిపిస్తున్న ఆనవాళ్లను సీబీఐ అధికారులు కనుగొన్నారు. అంతేకాక సదరు బాలికకు చెందినదిగా భావిస్తున్న మొబైల్ ఫోన్ కూడా పగిలిపోయిన స్థితిలో వీరికి చిక్కింది. బాలిక తల్లిదండ్రులపై ఒత్తిడి చేసిన నేపథ్యంలోనే వారు ఈ ఫోన్ ను తమకు అప్పగించినట్లు సీబీఐ అధికారులు చెప్పారు. దీంతో కొన్ని వాస్తవాలను బాధితుల తల్లిదండ్రులు కావాలనే దాచారని సీబీఐ ఓ అంచనాకు వచ్చింది. అయితే ఫోన్ తో పాటు విరిగిపోయిన చెప్పులను కూడా మరింత క్షుణ్ణంగా పరిశీలించే నిమిత్తం దర్యాప్తు సంస్థ వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపింది. రోజులు గడుస్తున్న కొద్ది కొత్తగా ఆధారాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశాలు లేకపోలేదన్న వాాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News