: హైదరాబాద్ లో మరిన్ని అక్రమ నిర్మాణాల కూల్చివేతకు జీహెచ్ఎంసీ రెఢీ!
హైదరాబాద్ మహానగరంలో మరిన్ని అక్రమ నిర్మాణాల కూల్చివేతకు జీహెచ్ఎంసీ అధికారులు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు. తొలి దశలో జీహెచ్ఎంసీ 172 అక్రమ భవనాల కూల్చివేతకు నడుం బిగించింది. వాటిని కూల్చివేసే ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. తొలి దశ అక్రమనిర్మాణాల కూల్చివేత ప్రక్రియ పూర్తికానుండడంతో రెండు, మూడు దశల్లో ఉన్న అక్రమ నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసేందుకు రెఢీ అయ్యారు. అక్రమ నిర్మాణాల గురించి ప్రజలకు ఏమైనా సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ కోరారు. అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవనాలు ఏమైనా ఉంటే టోల్‌ఫ్రీ నెం : 21111111 నెంబర్ కు ఫోన్ చేయాల్సిందిగా ఆయన సూచించారు. అక్రమ నిర్మాణాలకు అనుమతిచ్చే అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని సోమేష్‌కుమార్ హెచ్చరించారు.