: కూడంకుళం సందర్శించండి: పుతిన్ కు మోడీ ఆహ్వానం


తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రాన్ని సందర్శించాల్సిందిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ను భారత ప్రధాని మోడీ కోరారు. దీనికి పుతిన్ కూడా సానుకూలంగానే స్పందించారు. బ్రిక్స్ సమావేశాల సందర్భంగా బ్రెజిల్ లో మంగళవారం పొద్దుపోయిన తర్వాత మోడీ, పుతిన్ తో భేటీ అయ్యారు. అణ్వస్త్ర సంపత్తి, నిరాయుధీకరణకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఉన్న సారూప్యతల నేపథ్యంలో మోడీ, పుతిన్ ను భారత్ కు ఆహ్వానించారు. 40 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో ఇరు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న సంబంధాలపై నేతలిద్దరూ ముచ్చటించారు. ఈ సమయంలో రష్యాతో భారత్ కున్న సంబంధాలపై మోడీ, ఆసక్తికర ప్రసంగం చేశారు. "భారత్ కు అత్యంత సన్నిహిత మిత్ర దేశమేదని మా దేశంలోని ఏ చిన్నారిని అడిగినా, రష్యానే అనే సమాధానం ఠక్కున చెప్పేస్తారు" అని మోడీ చెప్పారు. గడచిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన మోడీని పుతిన్ అభినందించగా, ఐక్యరాజ్య సమితిలో చేపట్టాల్సిన సంస్కరణపై పుతిన్ చేసిన వ్యాఖ్యలపై మోడీ ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు.

  • Loading...

More Telugu News