: శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు గ్యాస్ పైప్ లైన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ, పారిశ్రామిక అవసరాల కోసం గ్యాస్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు గ్యాస్ పైప్ లైన్ వేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, గెయిల్ సీఎండీ త్రిపాఠీల మధ్య నిన్న అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం-కాకినాడ-నెల్లూరు మధ్య గ్యాస్ పైప్ లైన్ నిర్మిస్తారు. అలాగే, కర్ణాటకలోని తుమకూరు నుంచి హిందూపురం మీదుగా నెల్లూరు వరకు మరో పైప్ లైన్ వేస్తారు. అవసరమైన చోట్ల సబ్ లైన్లు వేసి గ్యాస్ సరఫరా చేస్తారు.