: చెన్నై మృతుల కుటుంబాలకు జగన్ పరామర్శ
చెన్నైలో భవనం కూలిన ఘటనలో మరణించిన వారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పరామర్శించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఇంతవరకు నష్టపరిహారం అందలేదని ఆయన చెప్పారు. చెన్నై ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారాన్ని బాధితులకు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నష్టపరిహారం అందే వరకు బాధితుల తరపున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని జగన్ అన్నారు.