: భారత్ లో మరిన్ని పెట్టుబడులు: వోక్స్ వ్యాగన్


భారత్ లో రూ.1,500 కోట్ల మేర అదనంగా పెట్టుబడులు పెట్టనున్నట్లు జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్ వెల్లడించింది. ఇప్పటికే భారత్ లో రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టిన వోక్స్ వ్యాగన్, మహారాష్ట్రలోని చకన్ ప్రాంతంలో ఉన్న తన ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకే ఈ నిధులను వినియోగించుకోనున్నట్లు వోక్స్ వ్యాగన్ ఇండియా ఎండీ మహేష్ కొడుమూడి చెప్పారు. అంతేకాక, భారత కార్ల మార్కెట్ లో 2 శాతంగా ఉన్న తమ వాటాను పెంచుకునేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News