: గ్రామాలపై గజరాజుల దాడి... గజగజా వణుకుతున్న జనం
చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లోని గ్రామాల్లోకి ఏనుగుల గుంపులు తరచుగా ప్రవేశించి పంటలను నాశనం చేస్తున్నాయి. కొన్ని సార్లు గజరాజులు గ్రామస్థులపై దాడికి దిగిన సందర్భాలున్నాయి. ఈ సంవత్సరం ఏనుగులు 16 మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఏనుగుల గుంపును అడవుల్లోకి తరిమివేయడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ఏనుగులను పట్టుకోవడానికి కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నా ఫలితం మాత్రం శూన్యం. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశించి తోటలను, పంటలను నాశనం చేస్తున్నాయి. వీటిని పట్టుకునేందుకు అటవీ శాఖ ప్రవేశపెట్టిన ఆపరేషన్ గజ, గణేష్ విఫలమయ్యాయి. ఇప్పటివరకు ప్రభుత్వం ఇందుకోసం 45 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టింది. ఇందులో, 124 కిలోమీటర్ల మేర కంచెను ఏర్పాటు చేసేందుకు రూ.30 కోట్లు ఖర్చు అయింది. ఏనుగులను బంధించేందుకు 11 మంది ట్రాకర్లు, వాచర్లు పనిచేస్తున్నారు.