: ఇకపై సొంత ధృవీకరణ చాలట...!


ఏదేనీ ప్రభుత్వ కార్యకలాపాలు, ఉద్యోగం, ఇతరత్రా పథకాల లబ్ధిపొందాలంటే, ఆయా సర్టిఫికెట్లను నోటరీతోనో, గెజిటెడ్ అధికారితోనో ధృవీకరించాల్సి వచ్చేది. అయితే పరిపాలన సంస్కరణ సంఘం సిఫార్సుల మేరకు ఇకపై సొంత ధృవీకరణతోనే సరిపెట్టేయొచ్చట. ఈ మేరకు కేంద్ర పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. ఈ పద్దతిని అమలు చేయడంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిశీలన చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. సర్టిఫికెట్ల ధృవీకరణ కోసం నోటరీలు రూ.100 నుంచి రూ. 500 దాకా తీసుకుంటున్నారని, సమయానికి ఒరిజినల్స్ లేని కారణంగా కొందరు గెజిటెడ్ అధికారులు ధృవీకరణకు తిరస్కరిస్తున్నారని ఆయన వివరించారు. దేశంలోని పల్లెలు, మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. అయితే సొంత ధృవీకరణతో సర్టిఫికెట్లు సమర్పించే అభ్యర్థులు, చివరి దశలో మాత్రం ఒరిజినల్స్ చూపాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News