: రిటైర్డ్ ఇంజనీర్లను సముచిత రీతిన సత్కరించిన చంద్రబాబు
ప్రముఖ ఇంజనీరు కేఎల్ రావు 112వ జయంతి వేడుకలు హైదరాబాదు అమీర్ పేటలోని కమ్మ సంఘంలో జరిగాయి. ఈ సందర్భంగా రిటైర్డ్ ఇంజనీర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సముచిత రీతిన సన్మానించారు. చంద్రబాబు నుంచి సత్కారం అందుకున్న వారిలో... వై.ధర్మారావు, ఆర్.ఎస్.ఎన్. మూర్తి, కేవీఎల్ నారాయణరావు, సీఎల్ఎన్ శాస్త్రి, తిరుపతిరెడ్డి, ఏవీ అప్పారావు, ఎ.కృష్ణారావు, బి.రోశయ్య, కేవీ సుబ్బారావు, రౌతు సత్యనారాయణ, బీపీ వెంకటేశ్వర్లు ఉన్నారు.