: అక్టోబర్ లో నటి దియా మిర్జా వివాహం


బాలీవుడ్ నటి దియా మిర్జా మరో మూడు నెలల్లో పెళ్లి కూతురు కానుంది. ప్రియుడు సాహిల్ సంఘాను అక్టోబర్ లో వివాహం చేసుకోనున్నట్లు దియా మీడియాకు వెల్లడించింది. ముంబయిలో తాజాగా జరిగిన 'ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ వీక్'లో పాల్గొన్న సమయంలో ఆమె ఈ విషయాన్ని తెలిపింది. కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న దియా, సాహిల్ ల వివాహం పలు కారణాలతో ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడింది. కాగా, తాజాగా వారిద్దరూ కలసి నిర్మించిన 'బాబీ జాసూస్' చిత్రం బాలీవుడ్ లో విజయాన్ని దక్కించుకుంది.

  • Loading...

More Telugu News