: ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పరిశీలకుల నియామకం


లోక్ సభ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవిచూసిన ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్ లో పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్రానికి జాతీయ పరిశీలకులుగా ముగ్గురు నేతలను నియమించింది. ఆతిషీ మలెర్నా, అజిత్ ఝా, గౌరవ్ తివారీలు ఇకనుంచీ ఆ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సి ఉంటుంది. త్వరలో అక్కడి పార్టీ కార్యకర్తలు, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థులు, ఇతరులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, భవిష్యత్తు కోసం ఓ ప్రణాళికను రూపొందిస్తామని మలెర్నా తెలిపారు. ఇంకా పలు ప్రాంతాల్లో కార్మికుల సమావేశాలు నిర్వహిస్తామని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News