: రుణాల రీషెడ్యూల్ పై రెండ్రోజుల్లో ఆర్ బీఐ నుంచి అనుమతి: మంత్రి ప్రత్తిపాటి


రైతుల రుణాల రీషెడ్యూల్ కు ఆర్ బీఐ అనుమతి ఇస్తుందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రెండు రోజుల్లో దీనికి సంబంధించి బ్యాంకు నుంచి అధికారిక సమాచారం వస్తుందని చెప్పారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేసి తీరతామని మంత్రి స్పష్టం చేశారు. ఇక పంటరుణాలతో పాటు బంగారం రుణాలనూ మాఫీ చేస్తామన్నారు. ఇక, రుణమాఫీ అంశంపై కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య మండిపడ్డారు. రుణమాఫీపై ఆర్ బీఐ ఒప్పుకోకుండానే ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు. మాఫీ ఎప్పుడు, ఎంతమందికి, ఎవరికి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకుండా రాజకీయ వలసలను ప్రోత్సహించడం సరికాదని సూచించారు.

  • Loading...

More Telugu News