: హైదరాబాదులో సరికొత్త ఐటీ పార్కుకు శ్రీకారం చుట్టిన కేసీఆర్


హైదరాబాదులోని నానక్ రాం గూడలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త ఐటీ పార్కుకు శ్రీకారం చుట్టారు. వేవ్ రాక్ ఐటీపార్కు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తోపాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ... హైదరాబాదును డిజిటల్ సిటీగా రూపొందిస్తామని అన్నారు. హైదరాబాదుకు మంచి భవిష్యత్ ఉన్నదని, పెట్టుబడి పెట్టేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, సింగిల్ విండో విధానం ద్వారా అన్ని రకాల అనుమతులు మంజూరు చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ప్రజలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News