: సీబీఐ డైరెక్టర్ మామకూ సర్వీసు పొడిగించా: లాలూ ప్రసాద్


పశువుల దాణా కుంభకోణంలో ఇప్పటికే దోషిగా తేలి, తిరిగి విచారణ ఎదుర్కొంటున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణ నిమిత్తం పాట్నాలోని సీబీఐ కోర్టుకు మంగళవారం హాజరైన ఆయన పలువురు అధికారుల సర్వీసులను పొడిగించానని చెప్పారు. ఇందులో భాగంగా, సీబీఐ ప్రస్తుత డైరెక్టర్ రంజిత్ సిన్హా మామ, బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి గజేంద్ర నారాయణ్ సర్వీసును కూడా పొడిగించానని లాలూ వ్యాఖ్యానించారు. అంతేకాక నాడు సీబీఐ ఎస్పీగా పనిచేసిన రాకేశ్ ఆస్థానా తండ్రి సర్వీసును కూడా పొడిగించినట్లు లాలూ సీబీఐ న్యాయమూర్తికి చెప్పారు. అయితే లాలూ అవాస్తవాలను కూడా చెబుతున్నట్లు కొన్ని ప్రభుత్వ రికార్డులు వెల్లడిస్తున్నాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News