: అంజలికి పవన్ కళ్యాణ్ చేయూత!


రెండ్రోజుల క్రితం అజ్ఞాతం వీడిన నేపథ్యంలో హీరోయిన్ అంజలి కెరీర్ మునుపటిలా ఉండబోదంటూ పలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటన్నింటిని పటాపంచలు చేస్తూ ఈ అందాలతారకు పవన్ కళ్యాణ్ తన గబ్బర్ సింగ్-2లో చాన్సివ్వాలని డిసైడైనట్టు తెలుస్తోంది. 'గబ్బర్ సింగ్'కు సీక్వెల్ గా వస్తోన్న ఈ చిత్రంలో ఇంతకుముందు కాజల్ ను హీరోయిన్ గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అంజలిని రెండో కథానాయికగా తీసుకున్నారట! ఈ భారీ చిత్రాన్ని సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కించాలని పవన్ ఇప్పటికే నిర్ణయించుకున్నాడు. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ ఈ చిత్రానికి నిర్మాత.

  • Loading...

More Telugu News