: జడ్చర్ల హాస్పిటల్ ను 100 పడకల ఆసుపత్రిగా మారుస్తాం: రాజయ్య
తెలంగాణ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య మంత్రి రాజయ్య నేడు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జడ్చర్ల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తామని చెప్పారు. ప్రతి రోగి ఆసుపత్రిలోనే చికిత్స పొందేలా చూస్తామని అన్నారు. మందుల కోసం రోగులను బయటకు పంపితే వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆరోగ్యశ్రీలో 939 రోగాలను చేరుస్తామని తెలిపారు. దీనితో పాటు, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు.