: పార్లమెంటు ఉభయసభల్లో కాంగ్రెస్, విపక్షాల ఆందోళన


పార్లమెంటు సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. 26/11 పేలుళ్ల తీవ్రవాది హఫీజ్ సయీద్ ను యోగా గురువు బాబా రాందేవ్ అనుచరుడు, జర్నలిస్టు వేద్ ప్రతాప్ వైదిక్ కలవడంపై లోక్ సభ, రాజ్యసభలో కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ విషయంలో ప్రభుత్వ ప్రమేయం ఉందని, వైదిక్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ మిత్రపక్షం శివసేన, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేశాయి. దాంతో, సభలో తీవ్ర గందరగోళం ఏర్పడటంతో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.

  • Loading...

More Telugu News