: స్వైన్ ఫ్లూతో కేరళలో 12 మంది మృతి
ప్రాణాంతకమైన స్వైన్ ఫ్లూ వైరస్ కేరళలో ఇప్పటిదాకా 12 మందిని పొట్టనబెట్టుకుంది. వర్షాకాలం మొదలు కాగానే తమ ప్రతాపం చూపుతూ శరవేగంగా విస్తరించే హెచ్1ఎన్1 వైరస్ ఇప్పటికే కేరళలో తన పంజా విసిరింది. అయితే రాష్ట్రంలో ఈ వైరస్ వ్యాప్తి అంత ప్రమాదకరమైన స్థాయిలో లేదని కేరళ వైద్యులు చెబుతుండటం గమనార్హం. గుజరాత్, రాజస్థాన్ లోనూ స్వైన్ ఫ్లూ కేసులు నమోదువుతున్నాయి.