: ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజ్యసభలో నేడు ప్రవేశపెట్టనున్న ట్రాయ్ బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అటు లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ తో బాబా రాందేవ్ అనుచరుడు, జర్నలిస్టు వైదిక్ కలవడాన్ని రాజ్యసభలో కాంగ్రెస్ లేవనెత్తనుంది. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి ఈ అంశంపై ఎలా స్పందించాలన్న దానిపైన మాట్లాడుకుంటున్నట్లు సమాచారం.