: అర్జెంటీనా ఓటమికి బ్రెజిల్లో సంబరాలు


మనకు దక్కనిది మన ప్రత్యర్థికి అస్సలు దక్కకూడదు! మానవ నైజం అనుకోవాలో, ఇంకేమనుకోవాలో తెలియదుగానీ... బ్రెజిలియన్ల వైఖరి చూస్తే ఇది నిజమే అనిపించకమానదు. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి అర్జెంటీనా ఓటమిపాలవడం పట్ల బ్రెజిల్ లో సంబరాలు చేసుకుంటున్నారు. అర్జెంటీనా ఓటమి ఖరారు కాగానే బ్రెజిలియన్లు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి సాంబా నృత్యాలు చేస్తూ, బాణాసంచా కాలుస్తూ హుషారుగా కనిపించారు. ఫైనల్ మ్యాచ్ కు వేదికగా నిలిచిన మరకానా స్టేడియం సమీపంలో ఓ బార్ వద్ద బ్రెజిల్ వాసులు చిత్తుగా తాగి.. 'అర్జెంటీనా బాగా విలపించు' అంటూ 'డోంట్ క్రై ఫర్ మీ అర్జెంటీనా' అనే సుప్రసిద్ధ గీతానికి పారడీలు కట్టి పాడారు. ఈ సందర్భంగా కొందరు బ్రెజిల్ అభిమానులు మాట్లాడుతూ, జర్మనీ గెలవడం మంచిదయిందని అభిప్రాయపడ్డారు. అర్జెంటీనా గెలిచి ఉంటే తమను ఏళ్ళపాటు ఉడికించేవాళ్ళని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News