: ఒడిశాలో మహిళపై సామూహిక అత్యాచారం
ఒడిశాలో 28 ఏళ్ల వివాహిత దళిత మహిళపై ముగ్గురు దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు. కేంద్రపారా జిల్లా బడగావ్ లోని తన బంధువుల ఇంటి నుంచి ఆమెను అపహరించిన ముగ్గురు వ్యక్తులు, పలు ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. విషయాన్ని బయటకు చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భయపెట్టిన నిందితులు ఆ తర్వాత ఆమెను వదిలిపెట్టారు. ఈ విషయంపై బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.