: భారత్ లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, భారత పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి జైపూర్ చేరుకున్నారు. భారత్ లోని వివిధ ప్రాంతాల్లో అక్షయ పాత్ర చేపడుతున్న పలు కార్యక్రమాలను క్లింటన్ తన పర్యటనలో భాగంగా పరిశీలించనున్నారు. ఈ నెల 16న జగత్ పురా ప్రాంతంలోని పాఠశాలను సందర్శించనున్న క్లింటన్, అక్కడ పాఠశాల విద్యార్థులకు తయారవుతున్న భోజన ఏర్పాట్లను పరిశీలిస్తారు. అదేవిధంగా ఈ నెల 17న లక్నో సమీపంలోని ఓ పాఠశాలలో క్లింటన్ ఫౌండేషన్ తరఫున ప్రారంభం కానున్న కమ్యూనిటీ సెంటర్ ను ఆయన సందర్శిస్తారు.