: మెస్సీకి 'గోల్డెన్ బాల్' అవార్డుపై మారడోనా మండిపాటు


ఫిఫా వరల్డ్ కప్ లో బెస్ట్ ప్లేయర్ గా నిలిచిన లయొనెల్ మెస్సీకి గోల్డెన్ బాల్ అవార్డు ఇవ్వడంపై అర్జెంటీనా దిగ్గజం డీగా మారడోనా మండిపడ్డాడు. మెస్సీ ఆ అవార్డుకు అర్హుడు కాడని విమర్శించాడు. ఒకవేళ సాధ్యమైతే అతనికి స్వర్గాన్ని బహూకరిస్తానని వ్యంగ్యోక్తి విసిరాడు. కాగా, మారడోనా వ్యాఖ్యలతో ఏకీభవించేవాళ్ళూ లేకపోలేదు. మెస్సీ ఈ టోర్నీలో నాలుగు గోల్స్ సాధించినా, అవన్నీ గ్రూప్ దశలోనే. మెస్సీ కంటే సహచరుడు జేవియర్ మషెరానో, డచ్ స్టార్ ఆర్జెన్ రాబెన్, జర్మన్ యోధుడు బాస్టిన్ ష్వీన్ స్టీగర్ లు మెరుగైన ప్రదర్శన చేశారని విమర్శకుల అభిప్రాయం. రోడ్రిగ్స్ కు 'గోల్డెన్ బూట్'... మాన్యుయెల్ న్యూర్ కు 'గోల్డెన్ గ్లోవ్' అవార్డులు సమంజసమేనంటున్న సాకర్ పండితులు, మెస్సీకి అవార్డు విషయంలో మాత్రం తప్పుబడుతున్నారు.

  • Loading...

More Telugu News