: నేడు ఉత్తరాంధ్రలో పర్యటించనున్న జగన్
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైఎస్సార్సీపీ అధినేత జగన్ నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన విశాఖ వరకు విమానంలో వెళ్లి... అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వెళతారు. పర్యటనలో భాగంగా చైన్నైలో 11 అంతస్థుల నిర్మాణం కూలిన ఘటనలో మరణించిన వారి కుటుంబీకులను పరామర్శిస్తారు. ఈరోజు, రేపు విజయనగరం జిల్లాలో, గురు, శుక్రవారాలు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు.