: నేటి నుంచి మూడు రోజుల పాటు ఏకధాటిగా యనమల కసరత్తు
2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ తయారీపై ఏపీ ఆర్థికమంత్రి యనమల దృష్టి సారించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు వివిధ శాఖల మంత్రులు, సంబంధిత అధికారులతో ఏకధాటిగా సమీక్షలు నిర్వహించనున్నారు. ఆదాయ వనరులను పెంచుకునే విషయంపై కూడా మంత్రులతో ఆయన చర్చించనున్నారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి ఆయన సమీక్ష ప్రారంభం అవుతుంది. మొత్తం 24 అంశాలపై సమీక్ష జరుగుతుంది. మంత్రులు లేని శాఖలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన చర్చిస్తారు.