: దేవాలయ భూముల ఆక్రమణపై కేసీఆర్ సీరియస్
నిన్నటివరకు హైదరాబాదు నగరంలోని భూఆక్రమణలపై దృష్టి పెట్టిన కేసీఆర్... తాజాగా దేవాలయ భూముల ఆక్రమణలపై ఫోకస్ పెట్టారు. దేవాదాయశాఖ అధికారులతో కేసీఆర్ నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ అంతటా దేవాలయ భూములు యథేచ్చగా ఆక్రమణలకు గురికావటంపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయ భూములు, ఆక్రమణలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. దేవాలయ భూములపై వచ్చేవారం పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తానని కేసీఆర్ చెప్పారు.