: జల సంరక్షణ చర్యలపై చంద్రబాబు సమీక్ష
రాష్ట్రంలో జల సంరక్షణ చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకునేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. గతంలో నీటి సంరక్షణ చర్యలు చేపట్టి రైతులను ఆదుకున్నామని... భూగర్భ జలాలను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో వ్యవస్థ మొత్తం నాశనమైందని అన్నారు.