: ఏపీలో వైద్యుల ఖాళీలను ఇప్పట్లో భర్తీ చేయలేం: మంత్రి కామినేని


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక లోటు ఉన్నందున తక్షణం వైద్యుల ఖాళీలను భర్తీ చేయలేమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో పరిశుభ్రత, మాతా శిశు సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అందుబాటులో కీలక వైద్య సేవలు అందిస్తామన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన మంత్రి, జూనియర్ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అంశంపై బిల్లు తయారుచేస్తామన్నారు. ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటుకు స్థల పరిశీలనకు కొద్ది రోజుల్లోనే కేంద్ర బృందం రాష్ట్రానికి రానున్నట్లు వెల్లడించారు.

  • Loading...

More Telugu News