: సంచిలో డబ్బులు తీసుకెళితే జేబుకు సరిపడా సరుకులు: బాబు
''ఒకప్పుడు జేబులో డబ్బులు వేసుకువెళితే సంచి నిండా సరుకులు తెచ్చుకునేవారు. ఇప్పుడు సంచి నిండా డబ్బులు తీసుకెళితే జేబు నిండా సరుకులు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది'' అంటూ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నేటి సామాన్యుడి పరిస్థితిని తనదైన శైలిలో వివరించారు.
జలయజ్ఞం పేరుతో భారీగా కాంగ్రెస్ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. నీటి మీద, తిండి గింజల మీద, ఇంటి మీద, కట్టుకునే బట్టలమీద ... అన్నిటి మీద పన్నులు వేసారని అన్నారు. ఈ రోజు ప్రతి ఇంటికీ రెండు మూడు సెల్ఫోన్లున్నాయని అవన్నీ తమ వల్లే వచ్చాయని చంద్రబాబు చెప్పారు.
చంద్రబాబు 'వస్తున్నా మీ కోసం' పాద యాత్ర ఈ రోజు గుంటూరు నగరంలోకి ప్రవేశించింది. ఉదయం చంద్రబాబు గుంటూరు సమీపంలోని అగతవరపాడు గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. గుంటూరు నగరంలో ప్రస్తుతం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.