: నెలాఖరులోగా ఎంఎంటీఎస్ రెండోదశ పనులు మొదలు: ద.మ రైల్వే జీఎం


ఈ నెలాఖరులోగా ఎంఎంటీఎస్ రెండోదశ పనులు ప్రారంభమవుతాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ తెలిపారు. పనుల ప్రారంభంలో ఎలాంటి ఆలస్యం ఉండదన్నారు. రెండోదశ పనులు అత్యంత కీలకమని, దీని వ్యయం రూ.817 కోట్లు అని వెల్లడించారు. మొత్తం మూడు అంచెల్లో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో దశలో సనత్ నగర్-మౌలాలి, మౌలాలి-ఘట్ కేసర్, మల్కాజ్ గిరి-సీతాఫల్ మండి, సికింద్రాబాద్-బొల్లారం, మేడ్చల్-బొల్లారం, తెల్లాపూర్-పటాన్ చెరు మార్గాలను పూర్తి చేస్తామని, వీటన్నింటికి ఎయిర్ పోర్ట్ తో కనెక్టివిటీ ఉంటుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News