: రాహుల్ గాంధీయే కాంగ్రెస్ ను నాశనం చేశారు: మాజీ ఎంపీ అజం


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. భారత రాజకీయాల్లో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ ను గాంధీ వారసుడే నాశనం చేశాడని పార్టీ మాజీ ఎంపీ గుఫ్రన్ అజం విమర్శించారు. యూత్ కాంగ్రెస్ ఓ ప్రయోగశాల అని ఆయన అనుకున్నారని, అలా ప్రయోగాలుచేసి ధ్వంసం చేశారని... అలానే కాంగ్రెస్ ను మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీపైనా వ్యాఖ్యలు చేసిన అజం, పార్టీ ప్రస్తుత పరిస్థితికి ఆమె కారణమన్నారు. సోనియా ప్రతక్ష్యంగా పార్టీని నడిపిన సమయంలోనే పరిస్థితులు బాగున్నాయన్నారు. ఎప్పుడైతే రాహుల్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారో అప్పుడే కాంగ్రెస్ ప్రతిష్ఠ దిగజారడం ప్రారంభమైందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News