: ఏడాది చివర్లోగా బీజేపీ తన ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలి: జేడీయు


బిజేపీ మిత్రపక్షం, ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా కొనసాగుతున్న జనతాదళ్ యునైటెడ్ ప్రధాన మంత్రి అభ్యర్థి విషయంలో తన ఒత్తిడిని మరింత పెంచింది. ఈ ఏడాది చివర్లోగా బీజేపీ తన ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని ఈ రోజు ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసింది. గత రెండు సాధారణ ఎన్నికల ముందుగా ప్రధానమంత్రి అభ్యర్థిని ఎన్డీఏ ముందుగా ప్రకటించే సంప్రదాయం కొనసాగుతోందని అందులో పేర్కొంది. అలాగే బీజేపీ ప్రకటించబోయే అభ్యర్థి లౌలికవాద భావాలను కలిగి ఉండాలని నిర్ధేశించింది. అంటే పరోక్షంగా నరేంద్రమోడీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా జనతాదళ్ చెప్పకనే చెప్పింది.

మోడీ అభ్యర్థిత్వాన్ని జనతాదళ్ యునైటెడ్ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే బీహార్ లో ఓటుబ్యాంక్ చీలిపోయి రెండు పార్టీలు నష్టపోయే ప్రమాదముందని జేడీయు వర్గాలు భావిస్తున్నాయి. అందుకే మోడీ కంటే అద్వానీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా తాము అంగీకరిస్తామని ఈ రోజు ఉదయం జేడీయు నేతలు సంకేతాలిచ్చారు.

  • Loading...

More Telugu News