: సాధారణ పరిపాలనకు రాజేశ్వర్ తివారీ బదిలీ
సీనియర్ ఐఏఎస్ అధికారి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీని ఏపీ సర్కారు బదిలీ చేసింది. ముఖ్యమంత్రికి కీలక విభాగంగా పరిగణిస్తున్న సాధారణ పరిపాలన శాఖలోని రాజకీయ వ్యవహారాలకు ముఖ్య కార్యదర్శిగా ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్ బోర్డు కార్యదర్శిగా పనిచేస్తున్న అధర్ సిన్హాకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను అదనపు బాధ్యతలుగా అప్పగించింది.